ఎయిరిండియా విమానంలో తెరుచుకున్న ర్యాట్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : లండన్‌కు వెళ్తున్న‌ ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి లండన్ సమీపంలోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ ల్యాండింగ్ సమయంలో ర్యామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ (ర్యాట్) తెరుచుకుంది. విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. పైలట్ ఎత్తు తగ్గించుకుంటూ ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో అత్యవసర సందర్భాల్లో వాడే ర్యాట్‌ బయటకు వచ్చింది. కానీ, పైలట్లు చాాకచక్యంగా వ్యవహరించి విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ర్యాట్‌ తెరుచుకున్నా విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply