Rangel | విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

Rangel | విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

  • పాఠశాల పరిశీలనలో సర్పంచ్ సుహాసిని నితిన్

Rangel | రెంజల్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నితిన్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ప్రాథమికొన్నత ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోకి నేరుగా వెళ్లి విద్యార్థుల విద్యపై వాకబు చేశారు. ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా? పాఠాలు బాగా చెప్తున్నారా? అంటూ ఆరా తీశారు. పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. నిత్యము ఉపాధ్యాయులు విద్య బోధనపై పలు ప్రశ్నలు గుప్పించారు. పాఠశాల శిథిలవస్థకు చేరుకుందని, టాయిలెట్లు, మరుగుదొడ్లు మంచిగా ఉన్నాయా? అని స్థానిక సర్పంచ్ సుహాసిని విద్యార్థులను ప్రశ్నించారు.

మధ్యాహ్న భోజన తనిఖీ…

మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె సందర్శించారు.విద్యార్థులకు రుచి కరమైన ఆహారం అండుతున్నారా అని విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు సరిపోయేంత భోజనాన్ని అందజేయాలని స్థానిక సర్పంచ్ సుహాసిని ఏజెన్సీ సభ్యులను సూచించారు. అండె సమయంలో మెల్కవలను పాటించాలని అన్నారు.

అంగన్వాడి కేంద్రాల పరిశీలన…

గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను స్థానిక సర్పంచ్ సుహాసిని పరిశీలించారు. 3-5 ఏళ్ళ లోపుఎంతమంది నిత్యం వస్తారని అడిగారు.వారికి ఎంత భోజనం తయారు చేస్తారని, గుడ్లు, బాలమృతం, పాలు ఎప్పుడెప్పుడు అందజేస్తారని అడిగారు. నిత్యం సమయపాలన పాటించాలని సర్పంచ్ సుహాసిని అన్నారు. ఆమె వెంట కార్యదర్శి మహబూబ్ అలీ, వార్డు మెంబర్ అశోక్, స్థానికులు గోపికృష్ణ, అనిల్, సంతోష్ మధు, అంకం సంతోష్, దండు సాయిలు, మారుతీ, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply