Ramesh Reddy | ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…

Ramesh Reddy | ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…

సర్పంచ్ అభ్యర్థి డొల్ల రమేష్ రెడ్డి

Ramesh Reddy | వేల్పూర్, ఆంధ్రప్రభ : ఒక్క అవకాశం ఇవ్వండి.. మోతే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని డొల్ల రమేష్ రెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఇవాళ‌ ఇంటింటి ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి డొల్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ… గతంలో గ్రామాన్ని నాయకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.

ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమ‌య్యారన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమన్నారు. నిధులను తీసుకువచ్చి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి డొల్ల రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మోసపోయి గోస పడకుండా నాకు ఒక్కసారి మద్దతిచ్చి.. తనను గెలిపిస్తే.. గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని సర్పంచ్ అభ్యర్థి డొల్ల రమేష్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

Leave a Reply