ఆదిలాబాద్ : రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో (RFCL)లో అమ్మోనియా లీకేజీ కలకలం రేపింది. ఈరోజు (బుధవారం) రాత్రి కర్మాగారంలో ఒక్కసారిగా అమ్మోనియా లీకవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు.
అధికారుల సమాచారం ప్రకారం లీకేజీ మరమ్మతులకు కనీసం 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కారణంగా కర్మాగారం పూర్తిగా 15 రోజులపాటు మూసివేయనున్నట్లు వెల్లడించారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత వీలైనంత త్వరగా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.