జైనూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు..

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో శనివారం ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే ఇది గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ వేడుకల్లో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు,జైనూర్ సహకార మాజీ చైర్మన్ కొడప హన్ను పటేల్, జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు మెస్రం అంబాజీరావు, పేందూర్ ప్రకాష్, జన్నావార్ పవన్ కుమార్, సర్పంచులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులు ఇచ్చిన పండుగ విందులో పాల్గొన్నారు. వేడుకల్లో జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవికుమార్ పోలీసులు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి బందోబస్తు పర్యవేక్షణ చేశారు. ముస్లింలు తమ బంధువుల ఇంటికి వెళ్లి ఆప్యాయతగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave a Reply