Rally | కర్నూలు జిల్లాకు నిధులు రాబట్టడంలో పాలకులు విఫలం…

Rally | కర్నూలు జిల్లాకు నిధులు రాబట్టడంలో పాలకులు విఫలం…
Rally | కర్నూలు, ఆంధ్రప్రభః దేశంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధి పథంలో నడవాలన్నా రైతులు రైతు కూలీల వలసల నివారించాలన్న జిల్లాలో వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే జరగాలని ఎన్నికలకు ముందు మాట్లాడిన కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు అధికార చేపట్టి పదవులు అనుభవిస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు రాబట్టడంలో జిల్లా ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్పలు విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్ లో జిల్లా అభివృద్ధికి నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందిన పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి బిషన్న అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్నాథం మునెప్పలు మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో జిల్లాకు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గతంలో మన హాయంలో ప్రారంభించిన వేదవతి, గుండ్రేవుల, RDS కుడికాలవలకి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో నిధులు కేటాయించలేదని, ప్రాజెక్టుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తుందని వలసలు పెరిగిపోయాయని బాధపడిన చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని పూర్తి చేసి కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్న వీటి గురించి మాట్లాడకపోవడం దారుణం అన్నారు.
జిల్లా ప్రజా ప్రతినిధులు వారి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయి తప్ప వాటిని పూర్తి చేసి జిల్లాను కరువు నుండి కాపాడుదామని ఆలోచన జిల్లా ప్రజా ప్రతినిధులకు లేదని వారు విమర్శించారు 14వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టులకు నిధుల కేటాయించకపోవడం దారుణం అన్నారు ఇంకా బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి కావున బడ్జెట్ ను సవరించి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే జిల్లా ప్రజా ప్రతినిధులు గళం విప్పాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా డిహెచ్పిఎస్ డిహెచ్పిఎస్ కార్యదర్శి సి మహేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ సవరణలు చేసి కర్నూలు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ ల కోసం నిధులు సాధించే విధంగా జిల్లా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని లేనిపక్షంలో స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా ద్రోహులుగా మిగులుతారని వారు హెచ్చరించారు.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు రాబట్టడంతోపాటు పారిశ్రామిక హబ్ అయినా ఓర్వకలలో త్వరితగతిన పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకి 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి సాధించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు వెంకటేశు కార్యదర్శి టి రామాంజనేయులు, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు నాగరాజు, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి అశోక్, డివైఎఫ్ఐ నగర నాయకులు హుస్సేన్ భాష, ఏఐవైఎఫ్ నగర నాయకులు అఖిల్, కలాకర్, శ్రీకాంత్, వలి ఆనంద్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
