Rally | పలుతండాలో నిర్వహించిన సేవాలాల్ ర్యాలీ

Rally | పలుతండాలో నిర్వహించిన సేవాలాల్ ర్యాలీ

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
ముఖ్య అతిధిగా పాల్గొన్న నంగారా భేరి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్

Rally | ఆళ్లపల్లి/గుండాల,ఆంధ్రప్రభః మండల పరిధిలోని పలుతండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని గుండాల మండలంలోని రోళ్ళగడ్డ తండా, నర్సాపురం తండా, గుండాల తండాల 8ప్రజలు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ రోళ్ళగడ్డ తండా నుండి మొదలై నర్సాపురం తండా, గుండాల తండా మీదుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్దకు చేరుకొని సేవాలాల్ మహారాజ్ జయంతి సభను ఏర్పాటుచేయడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి15వ తేదీన అనంతపూర్‌ జిల్లా గుత్తి మండలం రాంజీనాయక్‌ తండాలో భీమానాయక్, ధర్మణిమాత దంపతులకు జన్మించారని, బంజారా సమాజానికి సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక నాయకుడు, సంస్కృతి పరిరక్షకుడు, మార్గదర్శకుడుగా, బంజారా గిరిజనుల జీవితానికి వెలుగునిచ్చిన గొప్ప సంస్కర్తగా గుర్తింపు పొందారన్నారు.

బంజారా సాంస్కృతిక చరిత్ర, జీవన విధానం, ఆచార సంప్రదాయాలపై ఆయన చూపిన ప్రభావం ఎన్నటికీ మరవలేనిదని తెలిపారు. అదే విధంగా ప్రపంచం నలుమూలల వ్యాపించిన బంజారాలను ఏకతాటిపైకి తెచ్చి వలసలు వెళ్లక స్థిరనివాసులుగా ఉండేలా తండాలను నిర్మించడానికి కృషిచేశారన్నారు. ఎడ్లబండ్ల ద్వారా రవాణా మార్గాన్ని కనుగొని వ్యాపారాలకు అనుకూలమైన పరిస్థితులను కల్పించారని, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మంచిమార్గంలో నడిచి నలుగురికి సహాయపడాలని, బంజారాజాతి ఖ్యాతిని మరింత పెంచాలని వ్యాఖ్యానించారు. అనంతరం ర్యాలిగా వెళ్ళిగుండాల తండాలో సేవాలాల్ మహారాజ్ భోగ్ భండారో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా తండా పెద్దలకు, ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజేష్ నాయక్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రోళ్ళగడ్డ సర్పంచ్ భుక్య మంగమ్మ, గుండాల తండా వార్డు మెంబర్ జాటోత్ వీరన్న, మూడు తండాల పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply