Rally | భారీ జాతీయ పతాకంతో శ్రీ నారాయణ విద్యార్థుల ర్యాలీ

Rally | గణపురం, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ నారాయణ హైస్కూల్ విద్యార్థులు 100 మీటర్ల భారీ జాతీయ పతాకంతో పాఠశాల నుండి ప్రధాన రహదారి వెంబడి రెండు కిలోమీటర్ల మేర జాతీయ గీతాలు నినాదాలు నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు చేస్తున్న ర్యాలీ చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ… విద్యార్థులు యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.పోతుగంటి శశిధరచారి, స్వప్న ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply