Rajyasabha | నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ – రాజ్యసభకు (rajyasabha ) నలుగురు (four ) కొత్త సభ్యులను (new members ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (president droupadi murmu ) తాజాగా నామినేట్ చేశారు. పలువురు సభ్యుల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త సభ్యులను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాహిత్యం (literatur) , సైన్స్ (science) , కళలు (art) , సామాజిక సేవ (social service ) వంటి రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) ద్వారా సంక్రమించిన అధికారంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లాయర్ ఉజ్వల్ నిగమ్, సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్ లను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు.
నామినేట్ అయిన వారిలో ఉజ్వల్ దేవరావు నికమ్.. 26/11 ముంబై ఉగ్రవాద దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.
ఇక సదానందన్ మాస్తే.. కేరళలో అట్టడుగు వర్గాలకు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్త, విద్యావేత్త. హర్ష్ వర్ధన్ ష్రింగ్లా.. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, దౌత్యవేత్త. డాక్టర్ మీనాక్షి జైన్.. ప్రముఖ చరిత్రకారిణి, విద్యావేత్త.
