Raju Weds Rambai | చిన్న సినిమా పెద్ద విజయం..

Raju Weds Rambai | చిన్న సినిమా పెద్ద విజయం..

  • 4 రోజుల్లో 9.08 కోట్ల రూపాయల గ్రాస్..
  • విమర్శకుల ప్రశంసలు అందుకున్న “రాజు వెడ్స్ రాంబాయి”

Raju Weds Rambai, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ “రాజు వెడ్స్ రాంబాయి” బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుండటం విశేషం.

“రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై బన్నీ వాస్ (Bunny Vas) గ్రాండ్ గా థియేట్రికల్లో రిలీజ్ చేశారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అందరి ఆదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచి సినిమాకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని.. మరోసారి నిరూపించింది “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రం.

Leave a Reply