Rain Alert భారీ వర్షాలు

ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతుండగా, మరో మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు మరో మూడు రోజులు పాటు వానలే వానలు కురియనున్నాయి.
గంటకు 30 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో దంచి కొడుతున్న వానలు మరో మూడురోజులు కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని మూడు జిల్లాలకు ఆరెంజ్, ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆదిలాబాద్ కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆరెంజ్ అలర్ట్ జారీచేయడం జరిగింది.

ఇక ముంబైని వర్షం ముంచెత్తుతోంది.
రంగంలో దిగిన సైన్యం అత్యవసర సేవలందిస్తోంది. మరో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ. భారీ వర్షాలపై సీఎం ఫడ్నవిస్ సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముంబైలో స్కూల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నదులను తలపిస్తున్న రోడ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. విమానాశ్రయాలలో భారీగా నిలిచిన నీటివల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాందేడ్ జిల్లా ముఖేడ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల కుండపోత వర్షం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply