రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను తనిఖీ…

రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను తనిఖీ…

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన స్టేషన్ అంతటా పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు. గజ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ పోతపు వెంకట రమణారావు స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఎంపీకి వివరించారు.

ఈ పథకం కింద ప్రస్తుతం 1976 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను ఎంపీ పరిశీలించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు, ముఖ్యంగా దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏఈ శివాజీని ఆదేశించారు.

తనిఖీ అనంతరం స్టేషన్ సూపరింటెండెంట్ కాజోడ్ మాల్ మీనా కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, జి ఆర్ పి ఎస్ ఐ ఎల్ సరస్వతి, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎస్ఎంకె రెడ్డి, ఎ ఎస్ఐ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply