Railway | రైలు క్రింద పడి వ్యక్తి ఆత్మహత్య

Railway | రైలు క్రింద పడి వ్యక్తి ఆత్మహత్య
Railway | కరీమాబాద్, ఆంధ్రప్రభ : రైలు క్రిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిఆర్పి స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జి ఆర్ పీసీ ఐ టి సురేందర్ కథనం ప్రకారం బుధవారం గుర్తు తెలియని వ్యక్తి సుమారు(50-55 ) సంవత్సరాలు కల వ్యక్తి కిలోమీటర్ నెంబర్ 374/32-34 డౌన్ లైన్(Down line) కాజీపేట- వరంగల్ రైల్వే స్టేషన్ ల మధ్య సంతోషిమాత టెంపుల్ ఎదురుగా గల రైల్వే ట్రాక్ పై ఈ రోజు మధ్యాహ్నం తనకు గల వ్యక్తిగత కారణాలవల్ల గాని లేదా మరే ఇతర కారణాల వల్ల గాని గుర్తుతెలియని రైలు బండి క్రిందపడి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని సీఐ తెలిపారు.
మృతుడు గ్రీన్ అండ్ బ్లూ చెక్స్(green and blue checks) ఫుల్ షర్ట్, మల్టీకలర్ లుంగీ, యాష్ కలర్ ఫుల్ డ్రాయర్ పంచరంగుల రెండు వరుసల మోలతాడుధరించి ఉన్నాడు. మృతుడు 5’5″ ఎత్తు, చామన ఛాయ రంగు కలిగి ఉండి. గుర్తుపట్టుటకు కుడి తొడ పై పుట్టుమచ్చ కలదు.మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు గాని, గుర్తింపు పత్రాలు గాని ఏమియు లేవనీ సీఐ తెలిపారు.
మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంమార్చురీ రూమ్ లో భద్రపరుచనైనది. ఎవరికైనా వివరాలు తెలిసినచో ఎస్. రవీందర్ రెడ్డి రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరంగల్ ఫోన్ నెంబర్లు 98497 49220 .8712658627.సమాచారం అందించగలరని సిఐ కోరారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి..
- ఒకే రోజు ముగ్గురు చనిపోవడం నగరవాసులను కలిసి వేసింది..
కిలోమీటర్ నెంబర్ 375/19A-17 ఏ అప్ లైన్ వరంగల్ కాజీపేట రైల్వేస్టేషన్ల(railway stations) మధ్య మేఘన బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా గల కరీమాబాద్ వైపు వెళ్ళు చిన్న బ్రిడ్జి పై గుర్తుతెలియని రైలు ఢీకొనడం వల్ల తల పగిలి బలమైన రక్త గాయమై అప్ లైన్ ట్రాక్ పక్కన పడి మృతి చెందాడని సీఐ తెలిపారు.. మృతుని కుడి చెయ్యి ముఖం చర్మం ఊడిపోయి గుర్తుపట్టుటకు వీలు లేదు.
మృతుడు నలుపు రంగు జీన్స్ ప్యాంటు, నలుపు, పసుపు రంగు స్వెటర్ ధరించి ఉన్నాడు.. మృతుడు 5’5″ఎత్తు,చామన చాయ రంగు, నల్లని తల వెంట్రుకలు గడ్డం మీసాలు కలిగి ఉండి గుర్తు పట్టుటకు పొట్టపై పై పుట్టుమచ్చ కలదు. మృతుని వద్ద ఆఫీసర్ ఛాయిస్ 90(officer choice 90) ఎం.ఎల్ బాటిల్ కలదు.
మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు గాని గుర్తింపు పత్రాలు గాని లేవు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీ లో భద్రపర్చనైనది.ఏమైనా విలరాలు తెలిసినచో ఇన్వెస్టిగేషన్ అధికారి జి. సుదర్శన్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ 9701747014 , సీఐ-8712658585 సమాచారం అందించవలసిందిగా కోరారు ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు జి ఆర్ పి స్టేషన్ పరిధిలో. మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
