మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ ఆగ్రహావేశం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ (Nalgoṇḍa) పట్టణం మైసయ్య గౌడ్ విగ్రహం వద్ద ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దిష్టి బొమ్మను బీజేపీ (BJP) శ్రేణులు దహనం చేశారు. బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తల్లి పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు (Police) ముందు జాగ్రత్త చర్యగా పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.