Radar24 | ప్రమాద సమయంలో విమానంలో 100మంది…

Radar24 | ప్రమాద సమయంలో విమానంలో 100మంది…
Radar24 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న లా గార్డియా విమానాశ్రయంలో .. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానాన్ని ట్రక్కు ఢీకొన్నది. ఫ్లయిట్ రేడార్24 వెబ్సైట్ ప్రకారం ఆ విమానాశ్రయంలో ప్రస్తుతం రాకపోకలు స్తంభించాయి. ఎయిర్‌పోర్టులోని నాలుగవ రన్‌వేపై ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.
ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్, రన్‌వే దగ్గర ఉన్న ఫైర్ ఇంజిన్ ఢీకొన్నట్లు సమాచారం ఉన్నది. ఈ ఘటనకు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
