మహిళలను బైక్ రైడింగ్ నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్న “ఆర్ బీ ఫర్ ఉమెన్”

  • ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం నేపథ్యంలో నిర్వహణ…
  • ఇదే దినోత్సవం నాడు 11వ ఎడిషన్‌లోకి అడుగుపెట్టిన ఆర్ బీ ఫర్ ఉమెన్…

హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ బైక్ అద్దె వేదిక (రెంటల్ బైక్ ప్లాట్ఫామ్) అయిన రాయల్ బ్రదర్స్ ఆధ్వర్యంలో.. జపాన్ కు చెందిన యమహా మోటార్ కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా (MBSI) సహకారంతో వారి ప్రతిష్టాత్మక ఆర్ బీ ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్ 11వ ఎడిషన్‌ లో భాగంగా మూడవసారి హైదరాబాద్‌లో నిర్వహించింది.

నగరంలోని సురక్షితమైన, నియంత్రిత స్థలం అయిన హాస్టెన్ గో కార్టింగ్ జోన్‌లో (జూన్ 22, 2025) ఆదివారం నిర్వహించిన ప్రొఫెషనల్ ట్రైనింగ్ వర్క్‌షాప్ లో 120 మందికి పైగా మహిళలకు అవసరమైన స్కూటర్, మోటార్‌సైకిల్ రైడింగ్ నైపుణ్యాలతో సాధికారత కల్పించింది.

ఈ వర్క్ షాప్ మహిళలకు వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని అందించడమే కాకుండా ఉత్తేజకరమైన అవకాశాలను కల్పిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన “ఆర్ బీ ఫర్ ఉమెన్” కార్యక్రమం.. వివిధ వయసులు, వృత్తులు, నేపథ్యాల నుండి వచ్చిన 600 మందికి పైగా మహిళలకు బైక్ మొబిలిటీ పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని పెంపొందించింది. ఆర్ బీ ఫర్ ఉమెన్ సమగ్రంగా వృత్తిపరంగా నడిపించే శిక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

ఇది ప్రారంబికుల నుండి నైక్‌పుణ్య వంతుల వరకు వారి వాహన సవారీ పద్దతులను మెరుగుపర్చుకునే వరకు అనుగుణంగా రూపొందించబడ్డది. భద్రత యే తమ ప్రధాన ప్రాధాన్యతతో అన్ని అవసరమైన రైడింగ్ గేర్‌లను, వివిధ రకాల ప్రాక్టీస్ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది.

వ్యక్తిగతంగా బోధన, నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ.. ప్రధానంగా మహిళలు తమ నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, సురక్షితంగా, స్వతంత్రంగా రోడ్లపై ప్రయాణించడానికి అవసరమైన విశ్వాసాన్ని పొందుతారు. అద్దె – శిక్షణ ద్వారా మహిళలకు మోటార్‌సైకిళ్లను యాక్సెస్ చేసే ప్రధాన సాధికారత లక్ష్యంతో రాయల్ బ్రదర్స్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమ ప్రభావం గణనీయంగా విస్త్రుత పరచడానికి దీనిని మరిన్నీ భారతీయ నగరాలలో నిర్వహింపబడుతోంది.

“ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం నాడు, మార్పు, పరివర్తన కలిగించే ‘ఆర్ బీ ఫర్ ఉమెన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు 3వ సారి తీసుకురావడం పట్ల తాము సంతోషిస్తున్నామ”ని రాయల్ బ్రదర్స్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ అభిషేక్ చంద్రశేఖర్ అన్నారు. “500 మిలియన్ల మంది భారతీయులకు అందుబాటులో టూ వీలర్ మొబిలిటీని అందించడమే తమ లక్ష్యం, ముఖ్యంగా రైడింగ్ నైపుణ్యాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం ఆ దార్శనికతలో కీలకమైన భాగం. రైడ్ నేర్చుకోవడం కేవలం ఒక కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, ఇది స్వాతంత్ర్యానికి ఆజ్యం పోసే సాహస భావనను రేకెత్తించే సాధికారత ప్రయాణం అని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బైక్ రైడింగ్ పట్ల మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగింది, స్కూటర్ లేదా మోటార్ సైకిల్ అద్దెకు తీసుకోవడం ద్వారా వచ్చే సౌలభ్యాన్ని అనుభవించే అవకాశాన్ని వారికి అందించాలనుకుంటున్నామ”నీ ఆయన పేర్కొన్నారు.

అనంతరం MBSI సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ‘ నకావో హిరోషి’ మాట్లాడుతూ… “సుస్థిరమైన మొబిలిటీ పరిష్కారాలను సులభంగా చేరుకోవడం ద్వారా భారతదేశం అంతటా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం MBSI ప్రధాన దార్శనికత” అని అన్నారు. రాయల్ బ్రదర్స్‌తో కలిసి ఆర్ బీ ఫర్ ఉమెన్ ను కో-స్పాన్సర్ చేయడం మహిళలను సాధికారపరచడం, సామాజిక అడ్డంకులను తొలగించడంతో పాటు సమానత్వాన్ని పెంపొందించడం అనే తమ నిబద్ధతకు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. ఈ తరంలో మొబిలిటీ అనేది ఒక సవాలు, ఇది ప్రాథమిక అవసరాలను తీర్చడానికి, వ్యక్తిగత – వృత్తిపరమైన పని కోసం మహిళలను ఇతర రవాణా మార్గాలపై ఆధారపడేలా చేస్తుంది. తమ మహిళా సాధికారత ప్రాజెక్ట్, వ్యూహాత్మక సహకారాల ద్వారా, మహిళలు ద్విచక్ర వాహన రైడింగ్ నైపుణ్యాలను పొందేందుకు మార్గాలను సృష్టించడం, దేశవ్యాప్తంగా స్థిరమైన ఉపాధిని పొందేందుకు వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామనీ ఆయన తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాలకు ఈ భాగస్వామ్యాన్ని విస్తరించడం తమ లక్ష్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు” అని వివరించారు.

“ఆర్ బీ ఫర్ ఉమెన్” కార్యక్రమం మహిళా సాధికారత యొక్క శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుంది, నిజమైన స్వాతంత్ర్యం, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి బయటికి వెళ్ళే స్వేచ్ఛను అందించడంతో ప్రారంభమవుతుంది. రైడింగ్ చేసే ఆచరణాత్మక నైపుణ్యానికి మించి… ఈ కార్యక్రమం ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత సాధికారత యొక్క లోతైన భావాన్ని పొందుపరుస్తుంది. ఇది మహిళలు సాంప్రదాయ లింగ సమానత్వానికి ధైర్యంగా సవాలు చేయడానికి, ఉత్తేజకరమైన కొత్త సాహసాలను ప్రారంభించడానికి… మరీ ముఖ్యంగా వారి కమ్యూనిటీలలో స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్‌లుగా ఉద్భవించడానికి, అందరినీ కలుపుకొని, కదిలే సమానమైన సామాజిక భవిష్యత్తుకు దోహదపడటానికి వీలు కల్పిస్తుంది.

Leave a Reply