Puri Jagannadh | సూర్యతో సినిమా ఫిక్స్…?

Puri Jagannadh | సూర్యతో సినిమా ఫిక్స్…?

Puri Jagannadh | పూరి స్పీడే వేరు.. కథలు చెప్పడంలోనూ అదే జోరు
స్లమ్ డాగ్ తర్వాత నెక్స్ట్ ఎవరు..? బాలయ్య కాదు సూర్యేనా?
బిజినెస్ మేన్ కథ మొదట సూర్య కోసమేనా?
సరికొత్త ప్లాన్‌తో పూరి.. ఫామ్‌లోకి రీ-ఎంట్రీ?
స్లమ్ డాగ్ సక్సెస్‌పై నెక్ట్స్ ప్రాజెక్ట్ భవితవ్యం

Puri Jagannadh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్లమ్ డాగ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో చేస్తున్న స్లమ్ డాగ్ మూవీ తర్వాత పూరి సినిమా ఎవరితో అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ (Release) కాకుండానే.. పూరి ఇద్దరు హీరోలకు కథలు చెప్పారని.. ప్రాజెక్ట్ ఫైనల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్యతో పూరి సినిమా అంటూ న్యూస్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఇది నిజమేనా..?

Puri Jagannadh

Puri Jagannadh | పూరి స్పీడే వేరు..

పూరి రాసినంత స్పీడుగా.. తీసినంత స్పీడుగా మరో డైరెక్టర్ సినిమా తీయలేడు. ఇది అందరికీ తెలిసిందే. అదే స్పీడు.. కథలు చెప్పి ఒప్పించడంలో కూడా చూపిస్తుంటారు. ఒకే రోజు ఇద్దరు హీరోలకు కథలు చెప్పి ఒప్పించిన రోజులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. స్లమ్ డాగ్ మూవీ అనుకున్న విధంగా అనుకున్న టైమ్ కి పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఓటీటీ (OTT) డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడంతో రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Puri Jagannadh

Puri Jagannadh | బాలయ్యతో కాదు.. సూర్యతో..

ఇదిలా ఉంటే.. స్లమ్ డాగ్ రిలీజ్ కాకుండానే పూరి నెక్ట్స్ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల బాలయ్యతో పూరి సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయితే.. అందులో వాస్తవం లేదని తెలిసింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్యతో పూరి సినిమా అంటూ కోలీవుడ్, టాలీవుడ్ (Tollywood) లో వార్తలు రావడం ఆసక్తిగా మారింది. అసలు ఈ క్రేజీ కాంబోలో మూవీ ఎప్పుడో రావాలి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో చేసిన బిజినెస్ మేన్ కథ సూర్య కోసం రాసిందే. అందుకనే ఆ కథలో హీరో క్యారెక్టర్ పేరు సూర్యభాయ్. అయితే.. అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ కుదరలేదు.

Puri Jagannadh

Puri Jagannadh | సరికొత్త పూరి..

ఇప్పుడు పూరితో సినిమా చేయడానికి సూర్య ఇంట్రెస్ట్ గా ఉన్నాడని తెలియడం.. పూరి కూడా స్టార్ హీరో కోసం చూస్తుండడంతో.. వీరిద్దరూ కలిసారని.. కథ చెబితే వెంటనే చేయడానికి ఓకే చెప్పాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరితో సినిమా (Movie) చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే పూరితో సూర్య సినిమా ఉంటుందని తెలిసింది. వరుసగా ప్లాపులతో కెరీర్ లో ఎప్పుడూ చూడని పరిస్థితులు చూసిన పూరి ఈసారి సరికొత్తగా.. సరికొత్త కథలు చెప్పాలని ప్లాన్ చేస్తున్నాడట. స్లమ్ డాగ్ మూవీ సక్సెస్ అయితే.. పూరితో సినిమాలు చేసేందుకు మరికొంత మంది స్టారులు ముందుకు రావడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మరి.. పూరి ఫామ్ లోకి వచ్చి.. మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

Leave a Reply