అగ్నికి ఆహూతైన పూరి గుడిసె..

అగ్నికి ఆహూతైన పూరి గుడిసె..

పుత్తూరు, (ఆంధ్రప్రభ)
పుత్తూరు మండలం తడుకు పంచాయతీ పరిధిలోని వీఎస్‌ఎస్‌పురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జి. వెంకటేష్ అనే వ్యక్తి నివాసముంటున్న పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, దుస్తులు, అవసరమైన వస్తువులు అన్నీ దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన పై గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేశారు. బాధితునికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Leave a Reply