ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి

ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి

-సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను మంగ ళవారం సిపిఎం బృందం సందర్శించింది. మార్కెట్‌కు మొక్కజొన్న ధాన్యం తీసుకువచ్చిన రైతుల సమస్యలను సిపిఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ముని గెల రమేష్ మాట్లాడుతూ ఆరుగాల కష్టపడిన రైతులు మార్కెట్‌కు మొక్కజొన్న ధాన్యం తీసుకొచ్చినా ఫంగస్, సన్నాలు వంటి కారణాలు చూపుతూ మార్క్‌ఫెడ్ ఇంచార్జ్ కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపిం చారు.

గ్రామాల నుంచి మార్కెట్ వరకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పది రోజుల క్రితమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, ఇంచార్జ్ కొను గోళ్లలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్‌లో ఉన్న కొన్ని మొక్కజొన్న రాశులను పరిశీలిస్తే అవి బాగానే ఉన్నప్పటికీ, ఫంగస్ ఉందని చెప్పడం సరైన చర్య కాదన్నారు. మార్కెట్ చైర్మన్ స్వయంగా ధాన్యాన్ని పరిశీలించి, ఏ విధమైన షరతులు లేకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని మార్కెట్ అధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాల్సిందిగా కోరారు.

అలాగే కలెక్టర్ స్పందించి మార్క్‌ఫెడ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో నేడు ఉదయం 10గంటలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామ ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, తోడెంగల ఐలయ్య, రైతులు మంద మొగిలి, నీరటి సంపత్, దాసరి కోరయ్య, కాసు నాగరాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply