Mothkur | పత్తి మిల్లుల వద్ద బారులు తీరిన వాహనాలు
సీసీఐ కేంద్రాల్లో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయిలో కాటన్ మిల్లుల అసోసియేషన్ ఈనెల 17, 18న చేపట్టిన నిరవధిక సమ్మెతో రెండు రోజుల పాటు పత్తి కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. బుధవారం నుండి కొనుగోలు చేపట్టడంతో యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) మోత్కూర్ మార్కెట్ యార్డ్ పరిధిలోని సీసీఐ (CCI) కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి వాహనాలు బారులు తీరాయి.
మంగళవారం రాత్రి చర్చలు సఫలం కావడంతో రైతులు నిన్నటి అమ్మకాల కోసం స్లాట్ బుక్ చేసుకోకవడంతో ఈ రోజు అమ్మకాల కోసం నిన్న స్లాట్ బుక్ చేసుకున్న రైతులు (Farmers) ఆయా మిల్లుల వద్ద బుధవారం రాత్రి నుండే తమ పత్తి వాహనాలను సీరియల్ లో పెట్టి నిరీక్షణ చేశారు. దత్తప్పగూడెం నటరాజ్ మిల్లు వద్ద హైవే రోడ్డు వెంట పత్తి లోడ్ వాహనాలు (cotton vehicles) బారులు తీరాయి. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులకు ఊరట లభించింది.

