Pune Accident | పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం….
- ఆరు వాహనాలను ఢీకొన్న ట్రక్కు..
- 8 మంది దుర్మరణం
మహారాష్ట్ర : పూణేలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన ఓ ట్రక్కు అదుపు తప్పి హైవేపై ఉన్న ఆరు వాహనాలను ఢీకొట్టింది . ఢీకొన్న వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగి, ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలో ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగసిపడటంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pune Accident | కొనసాగుతున్న సహాయక చర్యలు





