Puja | గూడెంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు…

Puja | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో మాఘశుద్ద పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు ఉదయం నుండి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. ముందుగా భక్తులు దగ్గలో గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. మాఘశుద్ద పౌర్ణమి కావడంతో 277మంది దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. భక్తులకు లడ్డు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం భక్తులు గుట్టపై ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
