ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…
బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ స్థాపనను స్మరించుకున్నారు. నేతలు మాట్లాడుతూ 1951లో భారతీయ జనసంఘ్గా ఆవిర్భవించిన ఈ రాజకీయ పథం, 1977లో జనతా పార్టీలో భాగస్వామ్యంగా కొనసాగి, అనంతరం 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుందని తెలిపారు.
అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రజాసేవలో ముందంజలో నిలుస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తల బలాన్ని కలిగిన రాజకీయ పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. దేశభక్తి, సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం బీజేపీ ప్రత్యేకతలని నాయకులు పేర్కొన్నారు. ఈ విలువలతో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ సహచర కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
