విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేత..

దండేపల్లి, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ,దండేపల్లి మండలంలోని ద్వారక జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం నర్సాపూర్ గ్రామానికి చెందిన వంగ శంకర్ మల్లవ్వ దంపతుల పెద్ద కుమారుడు ఆదిలాబాద్ రురల్ ఎస్సై వంగ విష్ణువర్ధన్ విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడే ప్యాడ్లు, పెన్నులు,పెన్సిల్ స్కెల్ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న నర్సయ్య చేతుల మీదుగా 33 మందివిద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న నర్సయ్య ఎస్సై విష్ణువర్ధన్ లు మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత మార్కులు సాదించుకొని పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరవాలని విద్యార్థులకు సూచించారు,విద్యార్థులకు పరీక్షల సామగ్రి అందజేసిన ఎస్సై విష్ణువర్ధన్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు , సి ఆర్ పి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply