Telangana | డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Telangana | డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ డీజీపీ ఆఫీస్ (Telangana DGP Office) వద్ద స్వాములు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప స్వాములు ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.

అయ్యప్ప మాల ధరించిన కాంఛన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ (SI Krishnakanth) కు మెమో ఇచ్చారు. ఆ మెమోను ఉపసంహరించుకోవాలని స్వాములు నిరసన చేపట్టారు. అయ్యప్పమాల వేసుకొని పోలీస్ డ్యూటీకి రాకూడదంటూ ఇటీవల ఇచ్చిన మెమోతో వివాదం మొదలైంది. దీనిపైన స్వాములు డీజీపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారి నిరసనను ఆపేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Leave a Reply