సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన
సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఖమ్మం జర్నలిస్ట్ సాంబశివ రావు పై పెట్టిన అక్రమ కేసును(Illegal case) ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంఘాలకతీతంగా సూర్యాపేట జిల్లా(Suryapet district) జర్నలిస్ట్లులు స్థానిక వాణిజ్య భవన్ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులు వజ్జే వీరయ్య యాదవ్, గుండా శ్రీనివాస్ గుప్తా, మిక్కిలినేని శ్రీనివాస్ రావు(Mikkilineni Srinivas Rao)లు మాట్లాడుతూ.. యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నరైతుల సమస్యలను కవరేజ్ చేస్తున్నజర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు.
జర్నలిస్టులు(Journalists) ఎల్లప్పుడు ప్రజల పక్షమే అని ప్రశ్నించిన వారిని కేసుల పాలు చేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నిరసన(Nirasana) కార్యక్రమంలో జర్నలిస్టులు జహంగీర్, భూపతి రాములు, రాపర్తి మహేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, చారి, సతీష్, నాగరాజు,సురేష్, మల్లేష్, యాదగిరి, పురుషోత్తం, నర్సయ్య, శ్రీనివాస్, శ్రవణ్, లింగారెడ్డి, విజయ్, పాషా, ప్రవీణ్ తదితరులున్నారు.

