Protest event | కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు

Protest event | కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు

  • కేసీఆర్ కు నోటీసులపై బీఆర్ఎస్ మండిపాటు
  • పెద్దమందడి మాజీ జెడ్పటీజీ రెడ్డి

Protest event | పెద్దమందడి, ఆంధ్రప్రభ : పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు (కేసీఆర్) సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పేరుతో రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు వెల్టూర్ గ్రామంలో మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సిట్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ప్రజల కోసం ఉద్యమించి తెలంగాణ సాధించిన నాయకుడిపై కక్షపూరితంగా కేసులు బనాయిస్తున్నారని నేతలు విమర్శించారు. ఫోన్ టాపింగ్ కేసు పేరిట కేసీఆర్‌ను రాజకీయంగా వేధించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేయలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల తరఫున ప్రశ్నిస్తుండటాన్ని తట్టుకోలేకనే నోటీసులు జారీ చేశారని బిఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

రాజకీయ వేధింపులకు బిఆర్ఎస్ వెనక్కి తగ్గదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ సర్పంచ్ అశోక్, గ్రామ అధ్యక్షులు మల్లక్ సురేష్, గ్రామ మాజీ రైతుబంధు అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు చిత్తూర్ కృష్ణారెడ్డి, ఖాజా హుస్సేన్, బుసయ్య, సాంబ యాదయ్య, వార్డు సభ్యులు యాదయ్య,మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి వెంకటేష్, సుద్ద బాయ్ రాజు, రంజిత్ గౌడ్, శాంతయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply