Property tax | వారికి వడ్డీలో 50 శాతం రాయితీ

Property tax | వారికి వడ్డీలో 50 శాతం రాయితీ
Property tax | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త చెప్పింది. ఈనెల 31లోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వడ్డీతో పాటు పన్ను చెల్లించిన వారికి తదుపరి బిల్లులో ఆ మినహాయింపు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయం బకాయిదారులకు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉంది.
