ఆస్తి రిజిస్ట్రేషన్లు ఆగ‌వు

ఆస్తి రిజిస్ట్రేషన్లు ఆగ‌వు

  • క‌ర్నూలు జిల్లాలో ఆదివారం రూ.1.77 లక్షల ఆదాయం
  • సెలవు రోజు సైతం రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల విధులు
  • కర్నూలు సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు వెల్ల‌డి

కర్నూలు, ఆంధ్రప్రభ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్(Stamps and Registrations) ఐజీ ఆదేశాల మేరకు ఈ ఆదివారం సెలవు దినమైనప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహించినట్లు కర్నూలు సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు(Srinivasa Rao) సోమవారం వెల్లడించారు. ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు ముందడుగు వేయడం విశేషంగా నిలిచింది.

ఆదివారం మొత్తం రెండు డాక్యుమెంట్ల(Documents) నిర్వహించగా, ఆయా రిజిస్ట్రేషన్ ద్వారా మొత్తం రూ.1,77,770 ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరింది. సెలవు రోజు సైతం రిజిస్ట్రేషన్లు నిర్వహించి ఆదాయం స‌మ‌కూర్చిన‌ అధికారుల కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ పని తీరు మెరుగవుతోందని పలువురు పేర్కొన్నారు.

Leave a Reply