Promise | గెలుపు బాటలో అన్నవేన శ్యామల వేణు దత్త

Promise | గెలుపు బాటలో అన్నవేన శ్యామల వేణు దత్త


పెంచికల్ పేటలో ఏ నోట విన్నా.. అదే మాట
Promise | కమాన్ పూర్, ఆంధ్రప్రభ : పెంచికలపేటలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో కాంగ్రెస్ (Congress) పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అన్నవేన శ్యామల వేణుదత్త గెలుపు బాటలో పయనిస్తున్నారు. పెంచికల్ పేటలో ఏ నోట విన్నా.. కత్తెర గుర్తుకు ఓటేస్తామని ఓటర్లు భరోసా ఇస్తున్నారు. తాను సర్పంచ్ గా గెలిచిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 100శాతం అమలు చేస్తానంటూ ముందుకు సాగుతున్నారు.

గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామపంచాయితీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. రైతులకు (Former) పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్ల సౌకర్యం, రైతు కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పంట పొలాలకు నీరందించేలా కాలువలను బాగు చేస్తామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాత డ్రైనేజీల పునరుద్ధరిస్తామన్నారు. పెంచికల్ పేట్ నుండి ఎల్కలపల్లి వెళ్లే రోడ్డు నిర్మిస్తానని, ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే రహదారి, ఎస్సారెస్సీ కెనాల్ నుండి ఆలయానికి వెళ్లే రహదారి నిర్మిస్తామన్నారు.

1వ వార్డులో వాగు దాటేందుకు ప్రభుత్వం ద్వారా బ్రిడ్జి (Bridge) నిర్మాణం, 5వ వార్డులో సర్కార్ బావి నుండి శాలపల్లె వాగు మధ్యలో వంతెన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పంట పొలాలకు వెళ్లే నీరు వృథాగా పోకుండా చెక్ డ్యాంలు నిర్మిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి పని జరిగినా గ్రామ సభలో తీర్మాణం చేసి పనులు జరిగేలా చూస్తామన్నారు. సర్పంచ్ అంటే నాయకురాలిగా కాకుండా సేవకురాలిగా ఉంటానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Leave a Reply