Profit Hunt | గోల్డ్.. గోల్డే
- పసిడి ధర తగ్గిందోచ్
- తగ్గింపు ఊరింతే
- ఫ్రాపిట్ వేటలో మదుపుర్లు
- డాలరు కుదేలు..
- పాపం రూపాయి బేర్
- కానీ 8 రోజుల్లో లాభం ₹ 6,210లు
- రూ.1,520 లు తగ్గినా.. రూ.4,420లు లాభమే..
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : గత వారంలో 2025 డిసెంబర్ 10 నుంచి బంగారం ధర 4 రోజులు దూసుకు పోతున్న వేళ .. బంగారం ( Investors) మదుపుర్లు లాభాలపై (Pofit Hunt ) దృష్టి మళ్లించారు. ఇక రెండు నెలల అనంతరం డాలరు విలువ (Dollar Decrase) రికార్డు స్థాయిలో పడిపోవటంతో.. ఇక బంగారం ధర కూడా (Gold Rate Colapse) పతనావస్థకు చేరింది.
బులియన్ మార్కెట్‌లో గోల్డు (Gold) రేట్లు జర్రున కిందకు జారి పడ్డాయి. సోమవారం బంగారం ధర స్పీడ్ పెంచినప్పటికీ బుధవారం స్పీడ్ కు బ్రేక్ పడింది. బంగారం ధర తగ్గిందన్న కబురు మహిళలకు ఊరించ వచ్చు. కానీ బంగారం ధర నిజంగా ఎంత తగ్గింది.. పెరిగిన ధరే కాస్త తగ్గింది. గడచిన 8 రోజుల క్రయవిక్రయాలను పరిశీలిస్తే.. బంగారం ధర పెరిగిందే గానీ.. తగ్గలేదు. వాస్తవ పరిస్థితిని పరిశీలిద్దాం

Profit Hunt : ఈ రోజు ఎంత తగ్గిందంటే..
దేశవ్యాప్తంగా 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ₹ 1520లు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ₹ 1400లు, 18 క్యారెట్ల బంగారం ధర ₹1150లు తగ్గింది. నిజానికి డిసెంబర్ 9న 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹ 1,29,440 లు కాగ, డిసెంబర్ 10న ₹ 1,30,310లకు చేరింది . అంటే ₹ 870లు పెరిగింది. అక్కడి నుంచి డిసెంబర్ 12న అండే మరో మూడు రోజులకు ₹ 1,34,180 లకు చేరింది. ₹ 1,29,440ల నుంచి ₹ 1,34,180లకు చేరింది. ₹ 5,940లు ధర పెరిగింది. డిసెంబర్ 13న ₹ 270లు తగ్గింది. ఇక ఆదివారం స్థిరంగా ఉన్న బంగారం ధర సోమవారం ₹ 1470లు జతకలవటంతో బంగారం ధర ₹ 6,210 లు పెరిగింది. ఇక మంగళవారం రూ.1,520లు తగ్గటంతో.. మొత్తం 8 రోజుల్లో బంగారం ధర పెరుగుదల ₹ 4,420లకు చేరింది.
Profit Hunt : తగ్గుదలకు కారణమేంటీ?

తాజాగా రెండు నెలల్లోనే అత్యధికంగా డాలర్ ధర తగ్గిపోవటంతో బంగారం ధర తగ్గిపోయింది. నిజానికి కరెన్సీ విలువ తగ్గితే బంగారం ధర కూడా పెరుగుతుంది. ఈ రోజు ఇందుకు భిన్నంగా బంగారం ధర తగ్గింది. ఇంకేముంది మహిళలకు వింపైన శుభవార్త అందింది. హెవెన్ గోల్డ్ పై ఆశలు పెంచుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు.
కానీ గత ఎనిమిది రోజులుగా బంగారం ధర హెచ్చుతగ్గుల్లో .. బంగారం ధర పెరుగుదలనే మదుపర్లు లెక్క గట్టారు. ఏరోజున తగ్గుద్దో అనూహ్య పరిణామాల అంచనా.. మదుపర్లు లాభాల వేటలో పడ్డారు. ₹ 1,29,440ల నుంచి ₹ 1,35,380లకు చేరే సరికి.. మళ్లీ ధర తగ్గితే నష్టమని మంగళవారం మదుపర్లు లాభాలను పిండుకున్నారు.
ఇదే తరుణంలో అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర కూడా తగ్గింది. స్పాట్ గోల్డ్ ధర: అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం ఒక ఔన్సు (Ounce) స్పాట్ గోల్డ్ ధర $4,315 నుంచి $4,286 లకు పడిపోయింది. సుమారు 0.40% నుండి 0.63% వరకు తగ్గుదల కనిపించింది.ఇక అమెరికా డాలర్ విలువ రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫలితంగా బంగారం ధర కూడా తగ్గిపోయింది.

Profit Hunt : అమెరికా వల్లే..
వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ (Profit booking) కు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత (Government shutdown) ఉపాధి గణాంకాల (Jobs report) కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Profit Hunt : డాలరు కుదేలు
ఈ అనిశ్చితి డాలర్‌పై ఒత్తిడి పెంచింది . అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇతర ఆస్తుల వైపు మళ్లిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన భారీ సుంకాలు (Tariffs) ఆర్థిక విధానాలు అమెరికా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు డాలర్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఈ స్థితిలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ 98.26 స్థాయికి దిగజారింది.
Profit Hunt : పాపం రూపాయి

డాలర్ బలహీనపడినప్పటికీ, భారత రూపాయి (Indian Rupee) విలువ మాత్రం నేడు సరికొత్త రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రస్తుత ₹91.14 వద్ద చారిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. కేవలం 5 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి ₹90 నుండి ₹91 స్థాయికి పడిపోవడం గమనార్హం.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ల నుండి భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (Trade Deal)లో ఆలస్యం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
పెరిగిన దిగుమతుల ఖర్చుల వల్ల వాణిజ్య లోటు (Trade Deficit) పెరిగి రూపాయిపై అదనపు భారాన్ని మోపుతోంది. రూపాయి మరింతగా పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డాలర్లను విక్రయిస్తూ కొంత మేర మద్దతు ఇస్తున్నప్పటికీ, పతనాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ తగ్గినప్పటికీ, దేశీయంగా విదేశీ నిధుల తరలింపు , వాణిజ్య సవాళ్ల కారణంగా రూపాయి బలహీనంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో.. తగ్గని ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ (Hyderabad) , విజయవాడ (Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam) నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్ల బంగారం (మేలిమి పసిడి) ₹1,33,860. నిన్నటితో పోలిస్తే సుమారు ₹1,520 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం (ఆభరణాల తయారీకి): ₹1,22,700. నిన్నటితో పోలిస్తే సుమారు ₹1,400 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం: ₹1,00,390. ఇందులో సుమారు ₹1,150 మేర తగ్గుదల కనిపిస్తోంది.

