problems | ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా..
problems | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం పోచారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ ఎస్ బలపరిచిన పోచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరె రమేష్ కోరారు. ఈ రోజు గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
గ్రామ అభివృద్ధిని(Village development) దృష్టిలో పెట్టుకుని సర్పంచిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. తమను గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉండి సమస్యల(problems) పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తమపై నమ్మకంతో గ్రామ సర్పంచిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎలాంటి సమస్యలున్నా తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అభ్యర్థి రమేష్ తెలిపారు. ప్రచారంలో వారి వెంట బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

