ప్రియాంకా జవాల్కర్ తరచుగా గ్లామరస్, బోల్డ్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించే నటి. అయితే, ఈసారి ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ పూర్తి భిన్నంగా మెరిసింది. సింపుల్ గా ఎలాంటి హెవీ జ్యువెలరీ, పెద్దగా స్టైలింగ్ లేకుండా.. బ్లూ కలర్ కాటన్ చీరకు బ్రౌన్ కలర్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ జతచేస్తూ… చిన్న బొట్టు, సింపుల్‌గా వదిలేసిన జుట్టుతో ఎంతో గ్రేస్‌గా కనిపించింది.
సాధారణంగా కాటన్ చీరను రొటీన్ ఔట్‌ఫిట్‌గా చూస్తారు. కానీ ప్రియాంకా దానిని ధరించిన తీరు ఆ లుక్‌కి కొత్త అందాన్ని తెచ్చిందని, గ్లామర్ టచ్ లేకపోయినా మరింత ఆకర్షణీయంగా కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేవలం సింపుల్ కాటన్ చీరలోనే యువత హృదయాలను కట్టిపడేస్తోందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.








