బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భాష బోయిన సుధాకర్ ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి సోమవారం హాస్పిటల్ కి వెళ్లి బాధితుడు సుధాకర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సుధాకర్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఆయన సూచించారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట చిన్నాల రాజబాబు,మండల పార్టీ ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
