గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరారీ

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల క్రితం సోహైల్‌ అనే ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడి నుంచి పరారయ్యాడు. బేగంపేటలో దోపిడీ కేసులో సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చర్లపల్లి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాష్‌రూమ్‌ వెంటిలేటర్‌ నుంచి దూకి సోహైల్‌ పరారయ్యాడు. పలు కేసుల్లోనూ ఇతడు నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply