అర్చ‌కుల ఆశీర్వాదం..

అర్చ‌కుల ఆశీర్వాదం..

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయం భూ శ్రీ ఆదివరాహ స్వామి(Swayam Bhu Sri Adivaraha Swami) ఆలయంలో చిన్నారుల గజ్జపూజ (అరంగేట్రం) మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పూజా కార్యక్రమంలో నటరాజ నృత్య నికేతన్ 8వ కాలనీ నాట్య గురువు టి. రవికుమార్(T. Ravikumar) మాస్టర్ శిష్య బృందానికి గజ్జ పూజ నిర్వహించారు.

సుమారు 30 మంది చిన్నారులు హాజరు కాగా, వారి చేసిన నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. ఆది వరాహ స్వామి ఆలయం మాజీ డైరక్టర్ నృత్య కళాకారిణి భూపెల్లి జ్యోతి(Bhupelli Jyoti) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ అర్చకుడు రామానుజం పిల్లలను ఆశీర్వాదించి నటరాజ స్వామి ఆశీస్సులు అందజేసారు. ఉపేంద్ర వ్యాఖ్యానంలో చిన్నారుల తల్లిదండ్రులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply