Press conference | మ‌డ‌వి రాజేష్ ను గెలిపిస్తే..

Press conference | మ‌డ‌వి రాజేష్ ను గెలిపిస్తే..

  • ఐదేళ్లు ఇంటి ప‌న్ను క‌డ‌తా..
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్

Press conference | తిర్యాణి, ఆంధ్రప్రభ : తిర్యాని గ్రామపంచాయతీ అభ్యర్థిగా మడవి రాజేష్ ను గెలిపిస్తే గ్రామపంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అనిల్ గౌడ్ అన్నారు. ఇవాళ‌ తన స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని(Press conference) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పది హామీలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…. డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాజీ ఎమ్మెల్యే సక్కు, మాజీ డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్(Vishwaprasad) ఆధ్వర్యంలో తిర్యానీ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మడవి రాజేష్ ను ప్రకటించారు. అభ్యర్థి రాజేష్ ను గెలిపిస్తామని హామీ ఇచ్చి ఓటు వేసిన వారందరికీ ఐదు సంవత్సరాల పాటు ఇంటి పన్ను తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

యువతకు కావలసిన క్రీడా మైదానంతో పాటు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎవరైనా కాలం చెల్లిస్తే అంతక్రియలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆ ఇబ్బందులను తీరుస్తామని, మూడు కోట్ల వ్యయం(cost three crores)తో బ్రిడ్జ్ నిర్మించి, మోడల్ స్మశాన వాటికను నిర్మిస్తామని తెలిపారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వారికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీలోని ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. 10 వార్డుల‌ లోని మురికి కాలువ నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టి, నూతనంగా కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో అంతర్గత రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రజకులకు దోభిఘాట్ల నిర్మాణానికి 100శాతం(100 percent) కృషి చేస్తామని పేర్కొన్నారు.

భీమారం హనుమాన్ ఆలయానికి రేకుల షెడ్డు నిర్మాణానికి, గుడి సుందరీకరణకు నిధులు మంజూరయ్యేవిధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి గెలవగానే సమస్యతో ఉన్న ఇంటి నెంబర్ల మంజూరును కూడా చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ గెలిపించిన త‌ర్వాత‌ నుండి ఐదు సంవత్సరాల వరకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, అభ్యర్థి మడవి రాజేష్, పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల వెంకటేశం గౌడ్, యూత్ అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, ఉపాధ్యక్షులు పులిశెట్టి రాజు(Pulisetty Raju), ఎస్సీ సెల్ అధ్యక్షులు పడిగేల అమర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరిగంటి బాబు, మేన రాజు పడాల శేఖర్ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply