President | మమత నా చెల్లిలాంటిది..

President | మమత నా చెల్లిలాంటిది..
President | బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం
పశ్చిమబెంగాల్ సర్కార్ ను వివరణ కోరిన కేంద్రం
సా.5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
తృణమూల్ సర్కారు అన్ని హద్దులను దాటింది
ఈ ఘటనకు మమత బాధ్యత వహించాలి
రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని, ఎప్పటికీ గౌరవించాలి
ప్రధాని మోడీ నరేంద్ర మోడీ
President | ఆంధ్ర ప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమ బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రపతి ప్రొటోకాల్‌ను పట్టించుకోని మమత సర్కారుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సభను వేరేచోటుకు మార్చారు. ప్రొటోకాల్ ప్రకారం తనను స్వాగతించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు రావాల్సి ఉండగా ఒకేఒక్క మేయర్‌ను పంపడంపై ముర్ము అసహనం వ్యక్తంచేశారు.
రాష్ట్ర పభుత్వం వ్యవహరంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాలి, కానీ రాలేదు. గవర్నర్ బదిలీ అయినందువల్ల ఆయన కూడా రాలేదు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు ధన్యవాదాలు, ముందు అనుకున్నట్లు బిధాన్‌నగర్‌లో కార్యక్రమం జరిగిఉంటే బాగుండేది అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సీఎం మమత నా చెల్లిలాంటివారు నేనూ బెంగాల్ పుత్రికనే మరి నేను రావడాన్ని ఎందుకు అనుమతించలేదో అర్థం కావట్లేదని రాష్ట్రపతి ఆసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతికి ప్రోటోకాల్ వ్యవహరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ సర్కారు అన్ని హద్దులను దాటిందని, ఈ ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని, ఎప్పటికీ గౌరవించాలని ప్రధాని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రోటోకాల్ పై బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేందుకు రాష్ట్రపతి పదవిని భాజపా వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల ముందు రాష్ట్రపతి ముర్ము రాజకీయం చేస్తున్నారని మమతా బెనర్జీ కోల్‌కతాలో మండిపడ్డారు. ఆమె ఏడాదికి ఒకసారి వస్తే స్వాగతం పలుకుతానని, ఎన్నికల సమయంలో పదేపదే పర్యటనకు వస్తే అది సాధ్యం కాదని తెగేసి చెప్పారు. మణిపుర్‌లో గిరిజనుల పరిస్థితిపై ఆమె ఎందుకు మాట్లాడటం లేదని మమత ప్రశ్నించారు.
ఈ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా స్పందించారు. రాష్ట్రపతి ముర్ము మహిళ మాత్రమే కాకుండా గిరిజన సమాజానికి చెందిన నాయకురాలు అని తెలిపారు. రాష్ట్రపతి పదవికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. రాజ్యాంగంలోని ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రపతి పదవిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పదవిని రాజకీయంగా ఉపయోగించడం సరికాదు అని ఆమె సోషల్ మీడియాలో బెంగాల్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
