పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్

పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్
కడెం,ఆంధ్రప్రభః కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో గల పవనసుత రైస్ మిల్ వద్ద ఆదివారం జరిగిన నిర్మల్ జిల్లా పెరిక పురగిరి క్షత్రియ కుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చుంచు భూమన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి విజయకుమార్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యమ్ లింగన్న వసతి గృహాల అధ్యక్షులు డాక్టర్ డి వెంకటేశ్వర్లు అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ కోశాధికారి ఎస్ లింగన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్ల వేణుగోపాల్ కార్యనిర్వాహక సంయుక్త కార్యదర్శి కే విజయ్ కుమార్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బొడ్డు బుచ్చన్న రాష్ట్ర నాయకులులాశెట్టి శేఖర్ జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల పెరిక కుల సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షుడు గా మండలంలోని కొండుకూర్ గ్రామానికి ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ముక్కెర శ్రీనివాస్ మాట్లాడుతూ పెరిక కుల సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తమకు ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి విజయకుమార్ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు జిల్లాలోని మండలాల గ్రామాల పెరిక కుల సంఘం నేతలకు కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
