Nirmal జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం..
- పాల్గొన్న బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులు
నిర్మల్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : ఉమ్మడి అదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల – టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రాంత ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ లు, బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల పై ఉమ్మడి జిల్లాల ప్రభారీలకు, కన్వీనర్ లకు దిశా నిర్దేశం చేసారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీష్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు, బీజేపీ నాయకులు ఇన్చార్జి లు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.