ADB | ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజారక్షణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల ప్రతినిధి, జులై 11 (ఆంధ్రప్రభ) : ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Collector Kumar Deepak) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని నస్పూర్ (Naspur) లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ (Control room) ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడే వరదలు, విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు, ఆస్తులు నష్టపోకుండా సత్వరమే సేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

వరదలు, విపత్తులు సంభవించినప్పుడు సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ నం.08736- 250501 లో సంప్రదించవచ్చని, విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలు సైతం వినియోగదారులు ఈ నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు. విద్యుత్ బిల్లు (Electricity bill) కు సంబంధించిన డాక్యుమెంట్లను వాట్సాప్ నం.9492120078 కు పంపించాలని తెలిపారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా అధికార యంత్రాంగం ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందిస్తుందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.

Leave a Reply