చిట్యాలలో బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

చిట్యాల, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టుల తో ప్రజా పోరాట ఉద్యమాలను ఆపలేరని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా చిట్యాల పోలీసులు శనివారం ఉదయం పట్టణంలోని కీలక బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ అయిన వారు కూరెళ్ళ లింగస్వామి నిమ్మనగోటి శ్రీనివాస్, ఆగు అశోక్ యాదవ్, బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, దగ్గుల సైదులు, మాసం పల్లి వెంకన్న, నవీన్ రెడ్డి ఉన్నారు. తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తోందని వారు విమర్శించారు.
