Prajavani | ఫిర్యాదు పై విచారణ..

Prajavani | ఫిర్యాదు పై విచారణ..
Prajavani, బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టడం జరిగిందని అధికారి రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన దాసరి బాలరాజ్ కు చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చెనుగారి బాలనరసు కబ్జా చేశారని ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (Collector) జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఆదేశాల మేరకు గ్రామంలో కబ్జాకు గురైన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. ఇరువురితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించినట్లు చెప్పారు. స్థలానికి సంబంధించిన నివేదికను కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని సచివాలయ కార్యదర్శి మౌనిక, ఎంపీడీవో కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ నరేందర్ రెడ్డి తెలియచేసారు.
