Prajadarbar | సమస్యలు పరిష్కరిస్తాం..

Prajadarbar | సమస్యలు పరిష్కరిస్తాం..
- ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
Prajadarbar | వినుకొండ, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్(Chief Whip) కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్‌లో ప్రభుత్వం చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా జీవీ వినతులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి.. అర్జీలను పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజాదర్బార్(Prajadarbar)లో ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
