Prabhas | రాజాసాబ్ మంచి నిర్ణయం

Prabhas | రాజాసాబ్ మంచి నిర్ణయం

Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన భారీ హర్రర్ మూవీ రాజాసాబ్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మించిన రాజాసాబ్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ అనే టాక్ రాలేదు. మిక్సిడ్ టాక్ వచ్చింది. అయితే.. ఈ టాక్ నేపధ్యంలో మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారట.. అది డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఏంటా గుడ్ న్యూస్..

Prabhas | ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ..

కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. వేరే లాంగ్వేజస్ లో కూడా మంచి ఓపెనింగ్ రాబట్టింది. టాక్ ఇంకాస్త పాజిటీవ్ గా (Postive) వచ్చుంటే.. కలెక్షన్స్ వేరే లెవల్లో ఉండేవి అనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. మారుతి సినిమాల్లో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిస్తే.. ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్లో ఉంటుంది అనుకుంటే.. కామెడీ అంతగా లేకపోవడం మైనస్ అయ్యింది.

Prabhas

Prabhas | మేటర్ ఏంటంటే..

ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ ను చూపిండం తెలిసిందే. ఆ గెటప్.. ఆ లుక్ జనాలకు భలే నచ్చేసింది. దీంతో ఆ గెటప్ లో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో అని ఎదురు చూసిన జనాలకు ఆ క్యారెక్టర్నే చూపించకపోవడంతో ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అసలు సినిమాలో ప్రభాస్ (Prabhas) ఓల్డేజ్ లుక్ సీన్స్ మొత్తాన్ని తీసేయడం ట్విస్ట్ గా మారింది. దీనితో పాటుగా మరికొన్ని సీన్స్ తొలగించడం ఫ్యాన్స్ ని బాగా నిరాశపరిచింది. ఫైనల్ గా దీనిని మేకర్స్ ఫీడ్ బాక్ గా తీసుకొని ఇవాళ్టి నుంచే థియేటర్స్ లోకి ప్రభాస్ యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కాకుంటే.. రేపటి నుంచి అయినా ప్రింట్స్ లో అప్ డేట్ చేస్తారని తెలిసింది. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే.

Prabhas

CLICK HERE TO RAED ఒకే రోజు 7 సినిమాల ట్రైలర్స్ విడుదల..

CLICK HERE TO READ MORE

Leave a Reply