Power Loom Industry | జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే…

Power Loom Industry | జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే…
Power Loom Industry | రెండేళ్ల క్రితం కేసును ఛేజించిన మడికొండ పోలీసులు
Power Loom Industry | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : బ్రతుకుదేరువు కోసమై సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను వీడి వరంగల్ కు వచ్చాడు. రాంపూర్ ఏరియాల్లోని పవర్ లూమ్ ఇండస్ట్రీ(Power Loom Industry)లో పనిలో చేరాడు. ఇండస్ట్రీ వారిచ్చే జీతం ఎటు సరిపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం చేయాలోనని ఆలోచించాడు. +
కష్టించి, శ్రమటోర్చి పనిచేస్తున్నా వచ్చే ఆదాయం అవసరాలను తీర్చ లేకపోతోంది. అదీగాక సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాకాంత్ యాదవ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్ పూర్ జిల్లా సదర్ మండలం హర్ బస్పూర్ గ్రామానికి చెందిన ఉమాకాంత్ యాదవ్ హన్మకొండ జిల్లాలోని రాంపూర్ లోని నల్ల రాజ్యలక్ష్మి కంపెనీలో చోరీకి పాల్పడ్డాడు.
Power Loom Industry | చోరీకి పాల్పడ్డ ఉత్తరప్రదేశ్ చెందిన ఉమాకాంత్ అరెస్ట్

కంపెనీలో ఉన్న పానల్ బోర్డ్స్(Panel Boards), ఫిల్టర్స్, డ్రాప్ పిన్ బాక్స్ వంటి ముఖ్య పరికరాలు దొంగలించాడు. వాటిని అప్పుడే అమ్మితే ఎవరికైనా అనుమానం రావడంతో పాటు తన చోరీ బాగోతం బయట పడుతుందని భావించి చోరీ చేసిన పరికరాలను అక్కడే ఉన్న కంపెనీకి సంబంధించిన కంటైనర్ లో వేసి తాళం వేసి వెళ్ళాడు.
రెండేళ్ల క్రితం జరిగిన చోరీ విషయం అందరూ మరచి పోయి ఉంటారని భావించి చోరీ చేసిన పరికరాలను విక్రయించే ప్రయత్నంలో ఉన్న ఉమాకాంత్ యాదవ్ ను మడికొండ ఇన్స్ పెక్టర్ పుల్యాల కిషన్(Pulyala Kishan) బాగోతాన్ని గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా నందు మడికొండ ఇన్స్ పెక్టర్ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేపట్టారు. ఓ వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతుండటంను గుర్తించి
అతనిని పట్టుకొని విచారించారు.
Power Loom Industry | లక్షల విలువచేసే పరికరాలను స్వాధీనం..
అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్(Police Style Treatment) ఇవ్వడంతో రెండేళ్ల క్రితం జరిగిన చోరీ మిస్టరీ బయటపడింది. నిందితుడైన ఉమాకాంత్ యాదవ్ ను అరెస్ట్ చేసి ఆరున్నర లక్షల విలువచేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్బంగా మడికొండ ఇన్స్ పెక్టర్ పుల్యాల.కిషన్ మాట్లాడుతూ నేరస్థులు ఎంత కాలం అయినా శిక్షను అనుభవించక తప్పదని హెచ్చరించారు.
ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి దొంగతనాలకు పాలుపడ్డ ఏదొరకంగా దొరికి తీరుతారన్నారు.చోరీలు చేసే ముందు మీ మీ కుటుంబ భవిష్యత్తు, మీ బావి జీవితం గూర్చి ఆలోచించాలని హితువు చెప్పారు.నిందితుడిని పట్టుకోవడంలో సహాయ పడిన సిబ్బందిని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి,తదితర పోలీస్ ఉన్నతధికారులు అభినందించారు.

అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్(Police Style Tre
atment)

ఇవ్వడంతో రెండేళ్ల క్రితం జరిగిన చోరీ మిస్టరీ బయటపడింది. నిందితుడైన ఉమాకాంత్ యాదవ్ ను అరెస్ట్ చేసి ఆరున్నర లక్షల విలువచేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్బంగా మడికొండ ఇన్స్ పెక్టర్ పుల్యాల.కిషన్ మాట్లాడుతూ నేరస్థులు ఎంత కాలం అయినా శిక్షను అనుభవించక తప్పదని హెచ్చరించారు.
ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి దొంగతనాలకు పాలుపడ్డ ఏదొరకంగా దొరికి తీరుతారన్నారు.చోరీలు చేసే ముందు మీ మీ కుటుంబ భవిష్యత్తు, మీ బావి జీవితం గూర్చి ఆలోచించాలని హితువు చెప్పారు.నిందితుడిని పట్టుకోవడంలో సహాయ పడిన సిబ్బందిని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి,తదితర పోలీస్ ఉన్నతధికారులు అభినందించారు.
