AP | శ్రీశైలం ప్రాజెక్టులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి…

కర్నూలు బ్యూరో, జూన్ 11, ఆంధ్రప్రభ : శ్రీశైల జలాశయం (Srisailam Reservoir) పరిధిలోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు జలాశయంకు ఎగువ జూరాల (Upper jurala) నుంచి కృష్ణా ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం జలాశ‌య నీటిమట్టం 885 అడుగులకు గానూ బుధవారం ఉదయం 6 గంటలకు 835.80 అడుగులుగా ఉంది. ఇక జలాశయంలో 215 టీఎంసీల నీటికి గాను 56.0840 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.

ఇక జలాశయంకు ప్రస్తుతం 12,672 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం పరిధిలోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో (Right and left power centers) ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ కేంద్రం నుంచి 857 క్యూసెక్కుల నీటిని వినియోగించి 0.416 మెగా యూనిట్లు, ఇక తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 3098 క్యూసెక్కుల నీటిని వినియోగించి 1.450 మెగా యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి 4271 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తితో పాటు వివిధ రూపాల్లో దిగువకు విడుదలవుతుంది.

Leave a Reply