పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానుభావులని, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా , ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.


తెలుగు ప్రజల ఆత్మగౌరవం, భాషా గౌరవం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సేవలను ప్రతి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు జాతి ఐక్యతను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం ద్వారా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ ల నుండి అమరావతిలో నిర్వహించే ఈ వేడుకకు బస్సు మార్గాన్ని కూడా ప్రజలకు ఏర్పాటు చేశామని అన్నారు.


బస్ పాయింట్లు 64,63,62 డివిజన్ లకు రాజీవ్ నగర్ ఆయుర్వేద వైద్యశాల వద్ద,61,60,59,58 డివిజన్ లకు అజిత్ సింగ్ నగర్ బసవ పున్నయ్య స్టేడియం వద్ద, 57,36,33,32,31,30,29 డివిజన్ లకు ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ వద్ద, 28,27,26,25,24,23,1 డివిజన్ లకు బి. ఆర్. టి. ఎస్రోడ్డు రైల్వే క్వాటర్స్ వద్ద ఏర్పాటు చేయడమైనది దయచేసి అందరూ గమనించి సకాలంలో పైన తెలిపిన పాయింట్లకు చేరుకోవలసినదిగా కోరుచున్నామనీ పేర్కొన్నారు.

Leave a Reply