పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలి

పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలి

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అల్తాఫ్ బాబా విజ్ఞప్తి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ముస్లింలకు అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన రంజాన్ పండుగ ఈ ఏడాది మార్చి 21 శనివారం జరుపుకోనున్నారు. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం 20వ తేదీన సెలవు ప్రకటించింది. పండగ రోజు పరీక్ష నిర్వహిస్తే ముస్లింలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చంద్రమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం చంద్ర దర్శనం అవుతుంది. శనివారం రంజాన్ పండగ జరుపుకుంటారు. కావున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ముస్లింల తరఫున సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా శనివారం సెలవుగా ప్రకటించి, పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply