లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి..

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి..
వార్షిక జాతర పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే..
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అమ్మవారి ఉత్సవాల పోస్టర్లను ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. ముందుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ లను సత్కరించి ఆహ్వాన పత్రికలు అందించి ఉత్సవాలకు ఆహ్వానించారు.
మార్చి 27 నుంచి 31వ తేదీ వరకూ అమ్మవారి గ్రామోత్సవం, ఏప్రిల్ ఒకటో తేదీ జరిగే వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, దేవాదాయ శాఖ ఈఓ యార్లగడ్డ శ్రీనివాసరావు (వాసు) తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తుర్లపాటి రామమోహనరావు (గురుస్వామి), మత్తి శివపార్వతి, మోపిదేవి శివకుమార్, పులిగడ్డ శివపార్వతి, యాసం లంకమ్మ, సైకం శ్రీనివాసరావు, బట్టు మాధవి, నలుకుర్తి రాము, ఎక్స్ అఫిషియో సభ్యుడు తలగడదీవి బాలకృష్ణ, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
